calender_icon.png 23 January, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీ ఉద్యోగులు లేకుంటే.. ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయ్

23-01-2025 11:51:51 AM

హైదరాబాద్: 'కార్మికుడి మనస్తత్వం కలిగిన ఐటీ ఉద్యోగి' అంటూ ఇటీవల తనను కించపరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన ప్రయత్నానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మాజీ మంత్రి కెటి రామారావు(Former Minister KT Rama Rao) ఘాటుగా బదులిచ్చారు. నన్ను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునేవాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదని చమత్కరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు(IT Employees) ఎంతో కష్టపడి వారి జీవనోపాధిని పొందుతున్నారు. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో ఉన్న నా అక్కాచెల్లెళ్ళకు, అన్నాదమ్ముళ్ళకు సలాం.. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నుముక అన్నారు. మీరు లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయని కేటీఆర్ పేర్కొన్నారు. మీ విద్యార్హతలకు, మీ నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు(Politicians) సరితూగరని చెప్పారు. అలాంటి వాళ్ళు ప్రవేశపట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నా విద్యార్హతలు, నా ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పష్టం చేశారు.