పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రజాపాలన చూసి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు బుర్రలు బ్లాక్ అయ్యాయని, ప్రజల బుర్రలను కూడా పాడుచేయాలని చూస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు.
నిధులను సమకూర్చుకుంటూ పథకాల అమలుకు చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని, అయినా సీఎం, మం త్రులను బద్నాం చేసే పనిలో బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయని వి మర్శించారు. శనివారం జగ్గారెడ్డి గాంధీభవన్‌లో మీడియాతో మా ట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రజల దగ్గరకు పోవడానికి భయపడ్డారని, సచివాలయానికి కూడా రాలేదని దుయ్య పట్టారు. కనీసం మీడియాను కూ డా అనుమతించలేదన్నారు.