ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): కేటీఆర్ చేసిన తప్పులు బయటపడ్తుంటే.. అక్కసుతోనే సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌కు లై డిట్టేక్టర్ పరీక్షలు కాదు మొదట డ్రగ్స్ పరీక్షలు చేయించాలని ఎద్దేవా చేశారు. గతంలో డ్రగ్స్ వ్యవహారంలో వైట్ చాలెంజ్‌కు రేవంత్‌రెడ్డి పిలుపునిస్తే పారిపోయిన కేటీఆర్.. ఇప్పుడు సవాళ్లు విసరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.