హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి పెట్టారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నేతలతో కేటీఆర్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కాసేపట్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో కెటిఆర్ భేటీ కానున్నారు. పోలింగ్ సరళి గురించి అభ్యర్థులతో కెటిఆర్ సమీక్షించనున్నారు. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏ రాకేశ్రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.