calender_icon.png 5 October, 2024 | 6:45 PM

పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి: కేటీఆర్

05-10-2024 03:32:24 PM

హైదరాబాద్: రానున్న పంచాయతీ ఎన్నికల్లో రైతులు, ప్రజలు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కేటీఆర్ కోరారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతు ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  పాల్గొన్నారు. వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పారు.. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బోనస్ పేరుతో బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే రూ. 4 వేలు పింఛన్ ఇస్తానని ఇంకా ఇవ్వలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి కమీషన్ల పిచ్చి తప్పా.. ప్రజల సంక్షేమం పట్టదన్నారు.రాష్ట్రంలో అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశాడు. పెద్ద మనుషులు, మహిళలకు ఫించన్లు అన్నాడు. బతుకమ్మ చీరలు వచ్చినయా? పండుగ పండుగలా ఉన్నదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు కడుతా అంటే ఓట్లు వేసిన్రు, ఇళ్లు కూలగొడుతా అంటే ఓట్లు వేయలేదన్నారు. పది నెలల్లో ఒక్క మంచి పనైనా చేశారా? ప్రజలకు మేలు చేసే పనులు చేశారా? అన్నారు. రుణమాఫీ చేసేందుకు పైసల్లేవంట, కానీ రూ. లక్షా 50 వేల కోట్లు మాత్రం మూసీలో పోస్తడంట.  ప్రజలకు పథకాలు, మంచి చేస్తే కమీషన్లు రావు.