21-02-2025 12:04:23 PM
హైదరాబాద్: సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు(BRS Working President KT Rama Rao) తెలంగాణ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. బంజారాహిల్స్, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లలో నమోదైన కేసులు కొట్టివేయాలని పిటిషన్లలో పేర్కొన్నారు. ఎలాంటి కారణాలు లేకుండా కేసులు నమోదు చేశారని కేటీఆర్ ఆరోపించారు. బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద సీఎం రూ. 2,500 కోట్లు తీసుకున్నారని కేటిఆర్(KTR) పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రూ.2500 కోట్లు ఢిల్లీకి పంపించారని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్(Congress) కార్యకర్త ఫిర్యాదుతో బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదు అయింది. సీఎంను దురుద్దేశపూర్వకంగా అవమానించలేదని పిటిషన్ లో కేటీఆర్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో బాణాసంచా పేల్చినందుకు కేటీఆర్, ముఠా గోపాల్ పై కేసు బుక్ అయింది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్(Musheerabad Police Station)లో కేటీఆర్, ముఠా గోపాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.కేటీఆర్, ముఠా గోపాల్(Muta Gopal) ఈ కేసును కూడా కొట్టివేయాలని పిటిషన్ వేశారు. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.