calender_icon.png 31 January, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు పరిపాలన చేతకావడం లేదు: కేటీఆర్

31-01-2025 04:16:30 PM

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ల సన్మాన కార్యక్రమం(BRS Municipal Chairperson felicitation program)లో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Bharat Rashtra Samithi Working President KTR),పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... సమైక్య రాష్ట్రంలో మున్సిపాలిటీలు అంటే మురికి కూపాలుగా ఉండేవి.. బల్దియాలు అంటే ఖాయా పియా చల్దియా అనే సామెత ఉండేదన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) పట్టణాల అభివృద్ది కోసం ప్రత్యేక విజన్ తో పనిచేయాలని దిశానిర్ధేశం చేశారని గుర్తుచేశారు. అందుకే అర్ధిక ఇంజన్లుగా ఉన్న పట్టణాలను, సమగ్రంగా డెవలప్ చేయాలని అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పట్టణీకరణ ఆపాలని కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. పట్టణాల విస్తరణ అపడం వీలు కాదు కానీ ప్రభుత్వాలకు వాటిని సమగ్రంగా అభివృద్ది చేయడానికి మాత్రం అవకాశం ఉంటుందని చెప్పారు.

అందుకే ఆ దిశగా పదేళ్లు పనిచేశాం.. చేసిన పనిని అభివృద్ది నివేదికల రూపంలో ప్రజల ముందుంచామని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) వెల్లడించారు. 10 సంవత్సరాలు పాటు జరిగిన పట్టణాల అభివృద్ధి కేవలం డైలాగులు కొడితే కాలేదన్న కేటీఆర్ పక్కా ప్రణాళికతో పాటు అవసరమైన సంస్కరణలు నిరంతర పర్యవేక్షణ అవసరమైన నిధులు అందించడం వంటి నిరంతర ఫోకస్ తోనే తెలంగాణలోని పట్టణాలు ఈరోజు మోడల్ పట్టణాలుగా తయారయ్యాయని సూచించారు. తెలంగాణ పట్టణాలకు(Telangana towns) పది సంవత్సరాల్లో అనేక జాతీయ అవార్డులు(National Awards) దక్కాయని కొనియాడారు. గత పది సంవత్సరాలుగా మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు(Municipal chairperson, councillors) పట్టణాల అభివృద్ధి కోసం అద్భుతంగా పనిచేశారని తెలిపారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేశారని స్పష్టం చేశారు. పదవీ కాలం ముగిసిన చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజల్లోనే ఉండాలి… మళ్లీ ఎన్నికలు వస్తే ప్రజలు గెలిపించుకుంటారని ఆదేశించారు.

మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పరిపాలన వికేంద్రీకరణ కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలు(Telangana New districts), మున్సిపాలిటీలు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు పరిపాలన మరింత దగ్గర అయిందన్నారు. మన ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పట్టణాలతో పాటు ప్రజల ఆస్తుల విలువ కూడా పెరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రాగానే పట్టణాలలో అభివృద్ధి కుంటు పడటంతో పాటు ప్రజల ఆస్తుల విలువ కూడా భారీగా పడిపోయిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా కట్టాల్సింది పోయి హైడ్రా, మూసి ప్రాజెక్టు(Hydra, Musi Project)ల పేరుతో కూలగొడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నడిపే వారి ఆలోచనలు సానుకూలంగా ఉంటే రాష్ట్రము, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. గతంలో నల్లగొండ పట్టణాన్ని(Nalgonda town) సమూలంగా అభివృద్ధి చేసిన మనల్ని కాంగ్రెస్ మంత్రులు(Congress Ministers) అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కానీ అదే నల్లగొండ పట్టణంలో నాలుగు నెలలుగా సిబ్బందికి జీతాలు లేకున్నా పట్టించుకోవడం లేదని కేటీఆర్(KTR) ఆరోపణలు గుప్పించారు.

నా నల్లగొండ పర్యటన తర్వాత నన్ను బచ్చగాడు అంటున్న మంత్రి.. సీనియర్ అయ్యుండి పట్టణ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మోసపూరిత 420 హమీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు పాలన(Congress rule) చేయడం రావడం లేదని తెలిపారు. టకీ టకీ మని పైసలు పడుతాయన్నారు కానీ టకీ టకీమని డీల్లీలో పైసలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆరున్నర లక్షల కొత్త రేషన్(New Ration Cards) కార్డులను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ,  కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వనేలేదు అంటూ అబద్ధాలు చెప్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం అప్పటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka)తో పాటు కాంగ్రెస్ నాయకులను అడిగితే తెలుస్తోందన్నారు. డూప్లికేట్ గాంధీలకు(Duplicate Gandhis) తెలంగాణ ఇచ్చిన హమీలను అమలు చేసేలా బుద్ది ఇవ్వాలని మహాత్ముడి విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు.