calender_icon.png 2 October, 2024 | 1:58 PM

ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు: కేటీఆర్

02-10-2024 10:42:12 AM

హైదరాబాద్: ఆడపడుచులందరూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుండి తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులందరూ ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ.. తీరొక్క పువ్వులను దేవతా స్వరూపంగా భావించి పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ అన్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ.. సమైక్య పాలనలో ఆదరణకు నోచుకోని మన బతుకమ్మ పండుగ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కేటీఆర్ కోరారు.