calender_icon.png 12 December, 2024 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులపై పెట్టిన కేసులు వాపస్ తీసుకోవాలి

12-12-2024 01:43:25 PM

హైదరాబాద్: రైతులపై పెట్టిన కేసులు వాపసు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసులు వాపసు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ చెప్పాలని కేటీఆర్ కోరారు. రేవంత్, తిరుపతి సామ్రాజ్యంలోకి ఎవరూ రావద్దనేలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల ఫార్మా విలేజ్ అంశంలో రైతుల నిరసన సెగ తగిలింది. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో కొత్తగా మళ్లీ వస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి వైఖరిని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తన భూమి కోసం పోరాడిన కొడంగల్ లగచర్ల ఫార్మా బాధిత గిరిజన రైతుకు  గుండె పోటు వచ్చినా సంకెళ్లతో ఆసుపత్రికి తీసుకెళ్లారని బీఆర్ఎస్ పార్టీ ఫైర్ అయింది. రైతులు ఏమైనా టెర్రరిస్టులా రేవంత్? రైతుల చేతిలో నీ పతనం తప్పదని హెచ్చరించింది. లగచర్ల సంఘటనలో అరెస్టు అయిన రైతు వీర్యా నాయక్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. బుధవారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో..సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందని వైద్యులు ధృవీకరించారు.