calender_icon.png 18 October, 2024 | 6:53 PM

మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

18-10-2024 04:29:26 PM

హైదరాబాద్: మూసీ నదిపై మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. మూసీకి 1908లో భారీ వరద వచ్చిందని కేటీఆర్ తెలిపారు. 1908లో వరద రావడంతో సుమారు 15 వేల మంది మరణించారు.  మూసీ వరదల నుంచి హైదరాబాద్ ను కాపాడేందుకు అప్పటి నిజాం ప్రణాళిక రచించారు. హైదరాబాద్ ను వరదల నుంచి రక్షించేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించారని చెప్పారు. గ్రావిటీ ద్వారా మూసీకి 90 శాతానికి పైగా మురుగునీరు వస్తుందన్నారు. గతంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. గతంలో మూసీపై 17 బ్రిడ్జిలను మంజూరు చేశామని చెప్పారు.

గత ప్రభుత్వాలు మూసీని మురికికూపంలా మార్చాయని కేటీఆర్ ఆరోపించారు. 31 ఎస్టీపీలు పూర్తయితే మూసీలో స్వచ్ఛమైన నీరు వస్తాయని చెప్పారు. గతంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ను ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. రూ. వెయ్యి కోట్లతో ఎస్ఎన్ డీపీ ప్రాజెక్టును ప్రారంభించామ న్నారు. రూ. 5 వేల కోట్లతో రెండో దశ ఎస్ఎన్ డీపీని చేపట్టాలనుకున్నామం.. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చి ఉంటే రెండో దశ ఎస్ఎన్ డీపీని ప్రారంభించేవాళ్లమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండో దశ ఎస్ఎన్ డీపీ ప్రాజెక్టును రద్దు  చేసిందని కేటీఆర్ ఆరోపించారు. రూ. 540 కోట్లతో మూసీపై 14 బ్రిడ్జిలను నిర్మాణనికి ఆమోదం తెలిపామని చెప్పారు.