calender_icon.png 23 October, 2024 | 11:24 AM

హైడ్రా చర్యలు పేదలు, మధ్యతరగతికే వర్తిస్తాయా..?: కేటీఆర్

23-10-2024 10:05:14 AM

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా తీరుపై ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శలు చేశారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్యతరగతికే వర్తిస్తాయా..? ఎఫ్ టీఎల్, బఫర్ జోన్, హెచ్ఎఫ్ఎల్.. పేదలు, మధ్యతరగతికేనా..? ధనవంతులు, పెద్దవాళ్లకు వినహయింపు ఉంటుందేమో..? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

నార్సింగి ప్రాంతంలో ఆదిత్య బిల్డర్స్ సంస్థ మూసి నదిలో నిర్మాణాలను చేపడుతున్నది. మూసి సుందరీకరణ అంటూ, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ల పేరిట పేద, మధ్య తరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడా నంస్థల నిర్మాణాల మీద  ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? అంటూ బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ట్వీట్ చేశారు.