హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో బస్సు చార్జీలు పెంపు ప్రతిపాదనపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని కేటీఆర్ అన్నారు. ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సూచించారు. బస్సు ఛార్జీల పెంపుపై కర్నాటకను తెలంగాణ అనుసరించే రోజు దూరంలో లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణాల వల్ల రాష్ట్రానికి రూ. 295 కోట్ల నష్టం వాటిల్లిన తర్వాత కర్ణాటక బస్సు ఛార్జీల పెంపును ప్రభుత్వం ప్రతిపాదించింది.