calender_icon.png 24 October, 2024 | 12:27 PM

కాంగ్రెస్ పాలనలో ప్రతి బిడ్డా ఆగమే

24-10-2024 10:09:47 AM

హైదరాబాద్: సామాన్యులతో మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్ల పైకే, అడ్డగోలు సాకులతో సస్పెన్షన్ లు, హక్కులు అడిగితే వేటేయ్యడాలు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వంపై ద్వజమెత్తారు. 165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్ల సస్పెండ్ దారుణమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని ఫైర్ అయ్యారు. అడ్డగోలు సాకులతో సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కలు అడిగితే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాల మాట అటుంచితే.. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్లప్పుడూ ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సస్పెండ్  చేసిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.