లొట్టపీసు కేసుకు భయపడేది లేదు
మనం తప్పు చేయలేదు.. న్యాయపోరాటం చేద్దాం
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi ) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి పెట్టిన లొట్టపీసు కేసుకు భయపడేదిలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన మనకు ఇవి సమస్యలే కావన్నారు. కానీ తెలంగాణ(Telangana)లో ఏడాది గడిచినా హామీలు ఇంకా అమలు చేయట్లేదని ద్వజమెత్తారు. హడ్రా బాధితులు, లగచర్ల బాధితులతో పోల్చేతే మన ఇబ్బంది గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని సూచించారు. రాష్ట్రంలో త్రీడీ పాలన నడుస్తోందని కేటీఆర్(KTR) విమర్శించారు. త్రీడీ అంటే.. డైవర్షన్, డిస్ట్రాక్షన్, డిమోలిషన్ అనేది మాత్రమే నడుస్తోందన్నారు. కేసులు మనకు సమస్యే కాదు.. ప్రభుత్వాన్ని నిలదీయడమే మన పని అన్నారు.
రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా రైతు బంధు ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. 2001 లో పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఇబ్బందులతో పోల్చితే ఇప్పటి ఇబ్బందులు మనకు లెక్కకాదని స్పష్టం చేశారు. చావునోట్లో తలపెట్టి కేసీఆర్(KCR) రాష్ట్రాన్ని తెచ్చారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో అప్పుల చేశామని తప్పుడు ప్రచారం చేశారు. మనం తప్పు చేయలేదు.. న్యాపోరాటం చేద్దామన్నారు. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నాం.. వాటి ముందు ఇవి చాలా చిన్నవన్నారు. తన కేసు సంగతి తాను చూసుకుంటానన్న కేటీఆర్ తమకు మంచి లీగల్ టీమ్ ఉందన్నారు. కేసు గురించి మీరు టెన్షన్ పడకండని పార్టీ నేతలకు సూచించారు. ఇప్పుడు రైతుల సమస్యలపై అందరం కొట్లాడదమన్నారు. అవసరమైతే తన కేసు విషయంలో సుప్రీంకోర్టు(Supreme Court of India) వరకు అయినా పోదాం.. కొట్లాడదామని కేటీఆర్ స్పష్టం చేశారు.