14-03-2025 01:36:15 PM
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్లీలో హోదాను మరిచి తిట్లు - ఢిల్లీలో చిట్ చాట్లు. కాలు గడప దాటదు కానీ .. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి. సెటర్లు వేశారు. నీళ్లు లేక పంటలు ఎండి పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే.. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు.
39 సార్లు ఢిల్లీ పోయి(CM Revanth Reddy Delhi tour) మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప.. ఢిల్లీ నుండి సాధించిన పని.. తెచ్చిన రూపాయి లేదని విమర్శించారు. రాహుల్ గాంధీతో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం.. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి-ఊడితే మాకేంటి .. తెలంగాణకు ఒరిగేది ఏంటి? అని ప్రశ్నించారు. గ్రామగ్రామాన, గల్లీ గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే.. చీమకుట్టినట్టు కూడా లేని నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావ్ అంటూ మండిపడ్డారు. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు .. ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు ఉందన్నారు. ఇచ్చిన హామీల అమలు చేతగాక గాలి మాటలు.. గబ్బు కూతలు కూస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.