calender_icon.png 30 April, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి ముఖ్యమంత్రి

08-04-2025 01:43:48 PM

రేవంత్ విఫల సీఎం.. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం

కంచ గచ్చిబౌలి భూముల వెనక వేల కోట్ల బాగోతం

కంచ గచ్చిబౌలి భూముల వెనక బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు.

పవర్ ఫుల్ సీఎంల్లో రేవంత్ రెడ్డి నంబర్ వన్ గా ఉండాలి

హైదరాబాద్: మాజీ సర్పంచ్ నుంచి మాజీ సీఎం వరకు కేసులెలా పెట్టాలా అని చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో తాము లేమని కేటీఆర్ స్పష్టం చేశారు. హెచ్సీయూ విద్యార్థులపై కేసుల ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఏఐ వీడియోల(AI videos) పేరుతో తప్పించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఆరోపించారు. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని మేం అనవచ్చు.. కేసుల ఉపసంహరణ సరిపోదు.. జంతువధ కారకులపై కేసులు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రెండు జాతీయ పార్టీల జుట్లు దిల్లీ చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఒకరు చెప్పులు మోస్తే.. ఇంకొకరు బ్యాగులు మోస్తున్నారని కేటీఆర్(K. T. Rama Rao) ఎద్దేవా చేశారు. 16,17 నెలలైనా మంత్రివర్గాన్ని విస్తరించుకునే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. ఇన్ని సార్లు డిల్లీ వెళ్లినా ఒక్క రుపాయి కూడా రాలేదని విమర్శించారు. మీనాక్షి నటరాజన్ సచివాలయంలో సమీక్షలు చేస్తున్నారు.. రేవంత్ విఫల సీఎం కావునే కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకుంటుందని చెప్పారు.

తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. కంచ గచ్చిబౌలి భూముల వెనక వేల కోట్ల బాగోతం ఉందని ఆరోపించారు. కంచ గచ్చిబౌలి భూముల వెనక బీజేపీ(Bharatiya Janata Party) ఎంపీ కూడా ఉన్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల రూపాయల బాగోతం వివరాలు 2,3 రోజుల్లో చెబుతానని కేటీఆర్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్.. బీజేపీ ఉమ్మడి ముఖ్యమంత్రి అని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే పవర్ ఫుల్ సీఎంల్లో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నంబర్ వన్ గా ఉండాలని కేటీఆర్ తెలిపారు. గోదావరి, కృష్ణా జలాల్లో విచ్చలవిడి జలదోపిడి జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. భూకంపం, భారీ వరద వచ్చినా మేడిగడ్డ చెక్కుచెదరలేదు.. కేసీఆర్ పై కోపంతో నీళ్లు వదిలేశారు.. పంటలు ఎండుతున్నాయన్నారు.

ఆదిత్యనాథ్ దాస్(Adityanath Das) ను సలహాదారుగా పెట్టుకున్నారు. ఆదిత్యనాథ్ దాస్ గతంలో ఏపీ తరుఫున వాదించారని కేటీఆర్ తెలిపారు. ఆదిత్య నాథ్ దాస్ నియామకం ఏపీ ప్రయోజనాల కోసమా?, ఏపీ, చంద్రబాబు కోసమే ఆదిత్యనాథ్ ను నియమిచారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కృష్ణాలో అన్ని జలాశయాలు నిండాయి.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. సోషల్ మీడియాలో మాపై ఎదురుదాడి చేస్తున్నారు.. భారీగా ఖర్చు పెట్టి టూల్ కిట్ సాయంతో ఎదురుదాడి చేస్తున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు అసాధ్యమనే కాంగ్రెస్ దీక్షకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) వెళ్లలేదని ఆయన వెల్లడించారు.