calender_icon.png 22 September, 2024 | 2:17 PM

కాంగ్రెస్ ప్రకటించింది బోనస్ కాదు.. బోగస్

22-09-2024 11:56:57 AM

హైదరాబాద్: సింగరేణి కార్మికులను నిన్న కాంగ్రెస్ ప్రకటించింది బోనస్ కాదు.. బోగస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఆదివారం కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో కార్మికులకు 20 శాతం మించి లాభాలు ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సింగరేణి ఎన్నో విజయాలు సాధించిందని గుర్తుచేశారు. 1998 నుంచి 1999లో సింగరేణి లాభాల్లో కార్మికులకు 10 శాతం ఇచ్చారన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదే రూ.1,060 కోట్లకుపైగా లాభాలు తెచ్చామని సూచించారు. 2018-19 లో సింగరేణి రికార్డు స్థాయిలో లాభాలు సాధించింది.. ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ. లక్ష లాభం, 2023లో ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ. 1.60 లక్షల లాభం ఇచ్చామన్నారు. సింగరేణికి ఈ ఏడాది రూ. 4,701 కోట్ల లాభాలు వచ్చాయని భట్టి విక్రమార్క చెప్పారని కేటీఆర్ వెల్లడించారు.