calender_icon.png 4 October, 2024 | 2:56 PM

సీఎంవన్నీ డొల్లమాటలే

04-10-2024 12:28:35 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందన్నారు.వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందని విమర్శించారు. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా..మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం చేశారని మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ?.. అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల రైతులకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో ? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదు ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్ ముగిసినా ఇయ్యలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం రేవంత్  చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపమన్నారు.