calender_icon.png 30 March, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవయవ దానానికి ముందుకొచ్చిన కేటీఆర్

27-03-2025 01:05:02 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అసెంబ్లీ సాక్షిగా అవయవ దానానికి ముందుకు వచ్చారు. అవయవదానం(Organ donation bill) బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ ఈ ప్రకటన చేశారు. తాను అవయవదానానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మన ప్రజాప్రతినిధులం.. అందరికీ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల్లోనూ అవయవదానంపై చైతన్యం తేవాలని కోరారు. ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పించాలని కేటీఆర్ ప్రభుత్వానికి సూచించారు. సభ్యులు ముందుకు వస్తే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామన్నారు. అవయవదానంపై మొదటి సంతకం నేనే చేస్తానని తేల్చిచెప్పారు. అవయవదానం గొప్ప మానవీయ చర్య అన్నారు. అవయవదానం మరింత మందికి జీవితాన్నిస్తుందని కేటీఆర్ తెలిపారు.