calender_icon.png 22 September, 2024 | 2:33 PM

మంత్రి పొంగులేటికి కేటీఆర్ సవాల్

22-09-2024 01:17:44 PM

ఫోర్త్ సిటీని.. ఫోర్ బ్రదర్స్ సిటీ అనుకుంటున్నాం

హైదరాబాద్: అమృత్ టెండర్ల అవినీతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సి ఉంటుందని కేటీఆర్ డిమాండ్ చేశారు. అమృత్ టెండర్లపై మంత్రి పొంగులేటికి చిత్తశుద్ధి ఉంటే రండి మీరు, నేను హైకోర్టు సీజే దగ్గరకి పోదాం.. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వయిరీ చేయిద్దామని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. తాను ఆరోపించిన దాంట్లో అవినీతి జరగలేదని సిట్టింగ్ జడ్జి అంటే రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారునిన్న ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారని ఎద్దేవా చేశారు.  

హైకోర్టు సీజే దగ్గరికి రాడానికి మంత్రికి ఇబ్బంది ఉందంటే డేట్, టైం ఫిక్స్ చేయండి ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ దగ్గరికి పోదాం.. సీవీసీకి ఇద్దామన్నారు. ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకొని.. టెండర్లు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అమృత్ టెండర్ల అవినీతిపై సీవీసీ దగ్గరకు వెళ్లేందుకైనా సిద్ధమని ఆయన వెల్లడించారు. ఫోర్ట్ సిటీని.. ఫోర్ బ్రదర్స్ సిటీ అనుకుంటున్నాం అన్నారు. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నాం.. ప్రతీ సమాచారం తెలుస్తోందన్నారు. న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అమృత్ టెండర్ల అవినీతిపై బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదని? అని ప్రశ్నించారు. 9 నెలల్లో సీఎం సోదరుడు, బావమరిది ఆర్థికంగా బాగా ఎదిగారని కేటీఆర్ ధ్వజమెత్తారు.