13-04-2025 01:52:49 AM
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): పేదవాళ్లు సన్న బియ్యం తింటుంటే బీఆర్‌ఎస్ నేతలకు కడుపుమంటగా ఉన్నదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్‌కు ప్రభుత్వంపై బురదజల్లడం తప్పా మరో పని లేదని ఆయన విమర్శించారు. హైడ్రోజన్ బాంబుతో అల్లకల్లోలం సృష్టిస్తాడనుకుంటే.. చివరికి ఉల్లిగడ్డ బాంబు కూడా వేయకుండా అతీగతీ లేని ఆరోపణలు చేశాడని ఎంపీ చామల వ్యాఖ్యానించారు.
శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తమ హయాంలో సన్నబియ్యం ఇవ్వలేకపోయామని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఇస్తే.. ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తుందేమో అన్న భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
టీజీఐఐసీ నుంచి 37 కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రూ.9,995 కోట్ల 28 లక్షల బాండ్లను కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టాయని, ఈ డబ్బులు టీజీఐఐసీకి చెందిన ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్లో పడితే వాటిని యూటీలైజ్ చేసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.