బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి బీఆర్ఎస్లోకి వెళ్లరు
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం
హైదరాబాద్, జులై 30 (విజయక్రాంతి): గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. చాంబర్‌కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్టా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడారు.. ఆయన కాంగ్రెలో చేరినట్టేనా? అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారని, ఎక్కడిపోరని స్పష్టంచేశారు. తాను చేసిన ఆరోపణలను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఒప్పుకొన్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తే చూసుకోవడానికి తానున్నానని చెప్పారు. బీఆర్ఎస్కు తాను ఒక్కడిని చాలునని అన్నారు. బీఆర్ఎస్ ఎత్తివేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఉప్పల్ నారపల్లి ఫ్లుఓవర్‌కు త్వరలోనే రీ టెండర్ వేస్తామని తెలిపారు.