హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తిని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ శనివారం ఫోన్లో పరామర్శించారు. ఆర్ నారయణ మూర్తికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటిఆర్ స్పష్టం చేశారు. కాగా ఆర్ నారాయణ మూర్తి ఈ నెల 17న అస్వస్థతకు గురయ్యారు. ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా నీరసానికి గురయ్యారు.
దీంతో తోటి నటులు వెంటనే నారాయణ మూర్తిని నిమ్స్‌కు తరలించారు. రెండు నెలల క్రితం ఆయనకు బైపాస్ సర్జరీ జరిగినట్లు జరిగినట్లు తెలుస్తోంది. డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆర్ నారాయణ మూర్తి చికిత్స పొందుతుండగా, ఆయన క్రమంగా కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. దశాబ్దాలుగా హీరోగా, నిర్మాత, దర్శకుడిగా విప్లవ సినిమాలతో పాట సామాజిక నేపథ్ంయం ఉన్న సినమాలను తెరకెక్కిస్తూ పీపుల్స్ స్టార్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆర్ నారాయణ మూర్తి అరోగ్యంగా తిరిగి రావాలని వారు దేవుడిని ప్రార్థిస్తున్నారు.