హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని.. మీ ఏసీబీ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపినా స్వాగతం అంటూ ఎక్స్ లో కేటీఆర్ పోస్టు చేశారు. వాళ్లకి చాయ్, ఉస్మానియా బిస్కెట్ తో పాటు, మీ బర్త్ డే కేక్ ను వారు కట్ చేస్తామంటే తానే ఇప్పిస్తానంటూ కేటీఆర్ చమక్కరించారు. అరెస్టు భయంతో మలేషియాకు వెళ్తున్నారంటూ జరిగిన ప్రచారంపై కేటీఆర్ స్పందించారు. ఇప్పటికే ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ నేతను తమ స్టైల్ లో బర్త్ డే విషెస్ చెబుతున్నారు.