12-04-2025 12:00:00 AM
మా ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీఆర్‌ఎస్, బీజేపీ పని: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పందించారు. కేటీఆర్‌వి నిరాధార ఆరోపణలంటూ కొట్టిపారేశారు. తమ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్‌రెడ్డిని బద్నాం చేయడమే బీఆర్‌ఎస్, బీజేపీ పనిగా పెట్టుకుని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు.
కొందరు కావాలనే ఏఐ ఫొటోలు, వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్న చేస్తున్నారని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ఎక్కడా కూడా ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు.
మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు స్పందిస్తూ.. తమ వద్ద ఎవరూ ఎటువంటి భూమిని తనఖా పెట్టలేదని, టీజీఐఐసీకి ఎటువంటి తనఖా రుణాన్ని అందించలేదని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐ)కి తాము తనఖా రుణాన్ని అందించలేదని స్పష్టం చేసింది.