calender_icon.png 5 November, 2024 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో ఎక్కి డ్రైవర్ల ధర్నాకు హాజరైన కేటీఆర్

05-11-2024 04:55:06 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సంవత్సరానికి రూ.12,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆటోడ్రైవర్లు నిర్వహిస్తున్న ధర్నాకు హాజరయ్యేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కెటిఆర్) మంగళవారం ఆటో ఎక్కారు. 20 వేల ఆటోలకు పర్మిట్‌తోపాటు నెలకు రూ.5 వేలు స్టైఫండ్ ఇవ్వాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. సభను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఆటో ఎక్కి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. డ్రైవర్లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, మైక్రోఫైనాన్సింగ్ సదుపాయం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ‘‘ఆటోరిక్షా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, వారికి ఏడాదికి రూ. 12వేలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఏమైంది..? ఆటోరిక్షా డ్రైవర్ల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి నెలకు రూ.5 వేలు చెల్లించాలి’’ అని కేటీఆర్ కోరారు. ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ.12వేలు అందించనున్నట్లు ప్రకటించింది. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

మంగళవారం నాడు ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో అన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న ఆటో డ్రైవర్ యూనియన్లు నిర్వహించిన ప్రదర్శనలో రామారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి సుమారు 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి దిగజారిందని ఆరోపించారు. రాష్ట్రంలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని, అయితే ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, వారి జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని విమర్శించారు. “ఉచిత బస్సు ప్రయాణానికి మేము వ్యతిరేకం కాదు. అయితే ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలి. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును నెలకొల్పడంతో పాటు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. పార్టీ బీమా, ఆటో డ్రైవర్ల దోపిడీని నేరంగా పరిగణించాలి. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రోజుకు రూ.2వేలు సంపాదించే వారు ఇప్పుడు రూ.200-300లు కూడా రాక ఇబ్బందులు పడుతున్నామని, ఆటోడ్రైవర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కాంగ్రెస్  ప్రభుత్వం వచ్చాక ప్రారంభమయ్యాయి. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకొలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారి పేర్లతో సహా మేము అసెంబ్లీలో చెప్పామని తెలిపిన కేటీఆర్. ఇప్పటివరకు వారి కుటుంబాలను  కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోలేదని ద్వజమెత్తారు.