హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది అయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. డిక్లరేషన్ పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆదివారం నాడు హనుమకొండలో మాజీ మంత్రి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తులదారుల గొంతు కోశారని విమర్శించారు. కొత్త పథకాల మాట దేవుడెరుగు ఉన్న పథకాలకే పాతరేశారని ద్వజమెత్తారు. రేవత్ రెడ్డి ప్రభుత్వం రాగానే.. బీసీ బంధు.. రైతుబంధను బంద్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ కులగణన జపం ఎత్తుకుందని ఆరోపించారు. కులగణనలో 175 ప్రశ్నలు అడుతున్నారు. బ్యాంకుల్లో డబ్బెంత ఉంది.. ఏసీ ఉందా.. ఫ్రీజ్ ఉందా? అని అడుగుతున్నారు. కులగణన కోసం వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీసీల ఓట్లు కోసం అధికారులను బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా.. కాంగ్రెస్ ఓబీసీ మంత్రిత్వశాఖను ఏర్పరచలేదు.. కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వశాఖ ఉండాలని గతంలో కేసీఆర్ కోరారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధిని ప్రజలు అనుమానిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అబ్ధి కోసమే కులగణన అని ఆయన ఫైర్ అయ్యారు. కులగణన అంటున్నారు కానీ.. బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లేదు.. తమిళనాడులో 68 శాతం రిజర్వేషన్లపై అధ్యయనానికి బీఆర్ఎస్ బృందాన్ని పంపిందన్నారు. బీసీ యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పారు. ఇక్క బీసీ బిడ్డకైనా రూ, 10 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.