calender_icon.png 3 October, 2024 | 8:07 AM

కేటీఆర్‌ది దొర అహంకారం

03-10-2024 01:41:35 AM

అందుకే మహిళా మంత్రులను అవమానిస్తున్నారు

కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దొర అహంకారంతో మహిళా మంత్రుల పట్ల అను చిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగపూట కూడా అనవసరంగా తమపై తప్పుడు కూతలు కూస్తున్నారని, మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవుపలికారు.

ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ప్లాట్లు అమ్ముకున్న చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీది అని ఆరోపించారు. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. ప్రస్తు తం మంత్రులుగా ఉన్న తాము సమ్మక్క, సారాలమ్మ, రాణి రుద్రమ్మ ప్రాంతాల నుంచి వచ్చామని, తమపై ఎందుకు కేటీఆర్‌కు అంత అక్కసు అని ప్రశ్నించారు.

వరదల్లో మునిగి ప్రజలు నష్టపోవద్దని ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టిందన్నారు. బీఆర్‌ఎస్ గతంలో ప్రజల ఇళ్లను కూలగొట్టి బుల్డోజర్ ప్రభుత్వం నడిపారని విమర్శించారు. మమ్మల్ని అసభ్యకరంగా దూషించి, శిఖండి అని ఎలా అంటారని ప్రశ్నించారు.

తాము నామినేట్ చేస్తే అప్పనంగా వచ్చినోళ్లం కాదని, ప్రజలు ఎన్నుకున్న మంత్రులమని స్పష్టం చేశారు. పనికట్టుకుని సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదని, ఎవరి వ్యక్తిగత జీవి తం వారికి ఉంటుందన్నారు. సిని మా యాక్టర్లకు తాము వ్యతిరేకం కాదని, వాళ్లను ద్వేషించడం లేదన్నారు. పండగ పూట ప్రజలను ఆడబిడ్డలను ఆనందంగా ఉండనివ్వండి అని సూచించారు.