ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో వందశాతం రుణమాఫీ కాలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, కేటీఆర్‌కు దమ్ముంటే రుణమాఫీపై చర్చ కు సిద్ధం కావాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడి యాతో మాట్లాడారు. ఇటీవల పరిగి నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవా కులు చెవాకులు పేలారని, కేటీఆర్ చర్చకు సిద్ధమంటే అభివృద్ధి లెక్కలు చెప్తామని పేర్కొన్నారు.