calender_icon.png 9 January, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్.. మీరు లెక్కల్లో వీకా?

05-01-2025 12:19:29 AM

  1. మార్చి చెప్పే అలవాటు మీ నాన్న నుంచి నేర్చుకున్నారా? 
  2. అక్షరం మార్పు ఖర్చుపై కేటీఆర్‌కు ఎంపీ చామల చురకలు

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): టీఎస్ నుంచి టీజీగా అక్షరం మార్పు కోసం అక్షరాల రూ.వెయ్యి కోట్లు ఖర్చా?.. వెయ్యి కోట్లు కాదు.. లక్ష కోట్లు ఖర్చు చేసినా తెలంగాణ అస్తిత్వాన్ని చెరపలేరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన పోస్టుకు.. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు.

‘కేటీఆర్ గారు.. మీకు గుంటూరులో చదువుకున్నప్పుడు లెక్కలు చెప్పలేదా? లేక లెక్కల్లో మీరు వీకా? రూ.1.30 కోట్లను రూ.1000 కోట్లుగా మార్చి, ఏమార్చి చెప్పే అలవాటు మీ అయ్య నుంచి నేర్చుకున్నారా? లేక మీ బుద్దే అంతనా? ఇగోకు కేరాఫ్ అడ్రస్ నీవని తెలంగాణలో గల్లి పిల్లగాడు కూడా చెబుతాడు.

టీఎస్ నుంచి టీజీ పేరు మార్పులో నీకు ఇగో కన్పించింది. తెలంగాణ ప్రజలకు మాత్రం సెంటిమెంటే కనిపించింది. జనం టీజీ కోరుకుంటే.. నీ పార్టీ పేరు కలిసోస్తుందని దాన్ని టీఎస్‌గా మార్చిన కక్కుర్తి మీది. దందాల కోసం కాళేశ్వరం.. కమీషన్ల కోసం ఫార్ములా  ఈ రేస్, ధరణి పేరుతో భూ దందాలు. ఇది కదా మీ చరిత్ర’ అంటూ ఎంపీ చామల ఎక్స్‌లో పోస్టు చేశారు.