calender_icon.png 26 April, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పగ్గాల కోసం కేటీఆర్, కవిత పోటీ పడుతున్నారు

26-04-2025 12:42:45 AM

మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ 

నిజామాబాద్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ పగ్గాల కోసం కేటీఆర్ , కవిత తీవ్రంగా పోటీ పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం కోసమే వరంగల్ సభ నిర్వహిస్తున్నాడని ఆరోపించారు.

గత పదేళ్ల పాలనలో బిఆర్‌ఎస్ ప్రజలకు చేసింది ఏమీ లేదని కమిషన్ల రూపంలో ప్రజల సొమ్ము దోచుకుందని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ కేవలం కేటీఆర్.. కవిత కోసమే పని చేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అవినీతి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు.

లిక్కర్ స్కాం లో జైలుకు వెళ్లిన కవిత ప్రత్యక్ష ఉదాహరణగా చెప్ప వచ్చన్నారు. ప్రస్తుతం వరంగల్ లో నిర్వహిస్తున్న సభ ఎవరికోసమో చెప్పాలని. బిఆర్‌ఎస్ పెద్దలను ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ కు ఇవి చివరి రోజులనీ ప్రభాకర్ జోష్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, నారాయణ యాదవ్, శ్రీకాంత్, విజయ్, కుమార్ పాల్గొన్నారు