calender_icon.png 16 March, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మ దగ్ధం

16-03-2025 01:30:23 PM

మంథని,(విజయక్రాంతి): దళిత ముద్దుబిడ్డ, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అనుచిత వ్యాఖ్యల పట్ల ఆదివారం మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల దిష్టి బొమ్మలను మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద దహనం చేశారు. బీఆర్ఎస్  పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అనుచితంగా, అమర్యాదగా, అవమాన పరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు  ఐలి ప్రసాద్ అన్నారు.

అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏక వచనంతో మాట్లాడి సభా మర్యాదను మంట కలిపారన్నారని, దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని, ఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని ప్రసాద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్,  నాయకులు ఒడ్నాల శ్రీనివాస్, పోలు శివ, కుడుదుల వెంకన్న, రాజయ్య, సత్యం,  పార్వతి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

KTR And Jagadish Reddy Effigy Burnt In Manthani