calender_icon.png 16 March, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

16-03-2025 01:25:35 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): శాసనసభలోని దళిత స్పీకర్ ప్రసాద్ కుమార్ ను టిఆర్ఎస్ నాయకులు చులకనగా తీసుకొని అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ లో మాట్లాడీ నందుకు  నిరసనగా ఆదివారం బాన్సువాడ, చందూరు, పట్టణ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ  దళితులని కూడా చూడకుండా బి.ఆర్.ఎస్ కు చెందిన మాజీ మంత్రి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి లో కించపరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా వారి  దిష్టిబొమ్మ లను దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల కాంగ్రెస్ నాయకులు మధుసుదన్ రెడ్డి, నార్ల సురేష్, కాలేక్, గూడాల నగేష్, ఎజాజ్, చందూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతరాజు శ్రీనివాస్, చందూర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ చింతం సంజు, మైనార్టీ అధ్యక్షుడు లతీఫ్, చందూర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు గొర్ల మల్లయ్య, కారేగాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వసంతరావు, చందూరు మండల కిసాన్ కేస్ అధ్యక్షుడు గొర్ల సాయిలు, గూండ్ల శ్రీను, చందర్, మేడిపల్లి అజ్జు తదితరులు పాల్గొన్నారు.