calender_icon.png 17 November, 2024 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్యాయంగా మా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు: కేటీఆర్

20-07-2024 01:06:11 PM

ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం

గవర్నర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి నేతల బృందం శనివారం తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎమ్మెల్యేలు గవర్నర్ తో భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశంపై గవర్నర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు, కేసులు పెట్టారని ఆరోపించారు. ఉద్యమసమయంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి హామీలను అమలు చేయట్లేదని ఫిర్యాదు చేశామని కేటీఆర్ తెలిపారు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. గ్రంథాలయాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని విమర్శించారు. అన్యాయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.