హైదరాబాద్ సిటీబ్యూరో/ఎల్బీనగర్, జూలై 17 (విజయక్రాంతి): ఎల్బీనగర్ ఎమ్మె ల్యే సుధీర్‌రెడ్డి గత మూడు రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ గచ్చిబౌలిలోని ఏఐ జీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం ఆసుపత్రికి వెళ్లి సుధీర్‌రెడ్డిని పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
సుజయ్‌కు పరామర్శ..
తెలంగాణ ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ మాజీ డైరెక్టర్ సుజయ్ కారంపూరి తండ్రి ప్రొఫెసర్ సుభాశ్ మంగళవారం రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న కేటీఆర్.. బండ్లగూడ రిచ్మండ్ విల్లాలో నివాసం ఉంటున్న సుజ య్ కారంపూరి ఇంటికి వెళ్లి సుభాశ్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. సుజయ్ ను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రొ.సుభాశ్ తెలంగాణ ఉద్యమంతో సుదీర్ఘ అనుబంధం ఉందని కేటీఆర్ అన్నారు.