హైదరాబాద్: నిన్నటి అసెంబ్లీ సమావేశం వల్ల తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టంగా తెలిశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. ఏడాదికాలంగా పాలన చేతగాక పూర్తిగా విఫలమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), బీసీ డిక్లరేషన్(Congress BC Declaration) పేరిట సిగ్గులేకుండా అబద్ధాలను ప్రచారం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో సమర్పించిన డేటాపై వాళ్ళకే ఏమాత్రం క్లారిటీ లేదని విమర్శించారు.
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని నిన్నటితో తేలిపోయిందన్నారు.రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ(Congress party) నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకుంది. కేంద్రం(Central Govt)పై నెపం వేసి తప్పించుకోవాలని పన్నాగం పన్నుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇచ్చిన ఎన్నికల హామీలు, చెప్పిన కాంగ్రెస్ గ్యారెంటీలు(guarantees), చేసిన డిక్లరేషన్లు అన్నీ బూటకమని మరోసారి తేలిపోయిందని ద్వజమెత్తారు. అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్దిపొందడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్(Rahul) గాంధీ తన పేరును ఎలక్షన్ గాంధీ(Election Gandhi)గా మార్చుకుంటే మంచిదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం.. కాంగ్రెస్ సర్కారు నిబద్ధత వంద శాతం నకిలీ అని కేటీఆర్(K. T. Rama Rao) ఆరోపించారు.