calender_icon.png 2 November, 2024 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వాన్ని వదిలిపెట్టం: కేటీఆర్

15-05-2024 02:19:33 PM

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. కామారెడ్డిలో మంగళవారం రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారని అన్నారు. నేడు తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలుచేయాలని రైతులు ధర్నా చేస్తున్నారని చెప్పారు.

నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలో , భువనగిరి జిల్లా బీబీనగర్, సిరిసిల్ల మల్కపేటలో రైతులు ఆందోళనకు దిగారన్నార. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టువద్దని కోరుతున్నామన్నారు. రాజకీయాలు పక్కనపెట్టి రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వానికి కేటీఆర్ కోరారు. క్వింటాకు రూ. 500 బోనస్ ఇచ్చే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్నారు. రైతులకు బోనస్ ఇవ్వాలన్నారు. నల్గొండ- ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్ర స్థానంలో ఇప్పటికే నాలుగు సార్లు గెలిచామని కేటీఆర్ పేర్కొన్నారు.