calender_icon.png 29 September, 2024 | 8:57 PM

బావమరిదికి అమృతం.. పేదలకు విషం: కేటీఆర్

29-09-2024 06:36:39 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): అమృత్ టెండర్లపై మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణలు చేశారు. సీఎం బావమరిది శోధ కంపెనీకి రూ.1137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం కాద అని ప్రశ్నించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7,11,13లను సీఎం ఉల్లంఘించారని కేటీఆర్ పేర్కొన్నారు. బావమరిదితో లీగల్ నోటీసు పంపితే భయపడతాననుకున్నారా?, నీ అక్రమదందాల గురించి మాట్లాడననుకున్నారా?, బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోం అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చిన్న కంపెనీ అయిన శోద గత రెండేళ్లలో రూ.2 కోట్లు మాత్రమే లాభం ఆర్జించిందన్నారు. ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడటం కష్టమే అని, ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా, నిజాయితీగా ఉన్నదని  చెప్పారు. ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ వలే.. నువ్వు దొరికావు అని కేటీఆర్ ఆరోపించారు.