01-03-2025 05:12:52 PM
పాల్వంచ,(విజయక్రాంతి): కేటీపీఎస్ ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కు టీఆర్వీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారు గుండ్ల రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం కేటీపీఎస్ ఆవరణలోనే ఎస్పీఎఫ్ కార్యాలయంలో డైరీ క్యాలెండర్ అందజేశారు. ఈ సందర్భంగా టి ఆర్ వి కేస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా కాలనీలో దొంగతనాలను అరికట్టడం కొరకు పెట్రోలింగ్ నిర్వహించాలని కాలనీ కొంతమంది ఆకతాయిలో కొన్ని ప్రాంతాలలో తిరుగుతూ మద్యం సేవిస్తూ స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అసిస్టెంట్ కమాండెంట్ కు తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్ మాట్లాడుతూ దొంగతనాలు నివారణకు ప్రతిరోజు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని ఆకతాయి ఆట కట్టించడానికి ప్రతిరోజు ముఖ్యమైన ప్రదేశాలలో మా స్పెషల్ పార్టీ వారితో నిగా ఏర్పాటు చేసి కాలనీలో ప్రశాంత వాతావరణంలో కొరకు తగు చర్యలు తీసుకుంటున్నామని యూనియన్ నాయకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటిపిఎస్ ఐదవ దశ ఆరోదశ ఏడోదశలోని రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు ,రాష్ట్ర నాయకులు ,జన్కో నాయకులు, ఆర్టిజన్స్ తదితరులు పాల్గొన్నారు.