calender_icon.png 16 January, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా క్షేత్రగిరి వెంకటేశ్వర జాతర

15-01-2025 10:55:03 PM

మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ మండలం ఘనపూర్ లోని క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి జాతర మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈనెల 12న ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమైన జాతర బుధవారం ముగిసింది. సంక్రాంతి రోజు స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. జాతరకు మేడ్చల్ తో పాటు సరిహద్దు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మేడ్చల్ కౌన్సిలర్ మణికంఠ గౌడ్ భక్తులందరికీ అన్నదానం చేశారు. ప్రతి ఏడు భక్తులకు మణికంఠ గౌడ్ అన్నదానం చేస్తున్నారు. జాతర సందర్భంగా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.