calender_icon.png 26 February, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు మరోమారు కేఆర్‌ఎంబీ ప్రత్యేక సమావేశం

26-02-2025 07:37:59 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కృష్ణానది యాజమాన్య బోర్డు(Krishna River Management Board) సమావేశం ముగిసింది. జలసౌధలో(Jalasoudha) కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్(KRMB Chairman Atul Jain) నేతృత్వంలో జరిగిన భేటీలో నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి, ఈఎన్సీ పాల్గొన్నారు. శ్రీశైలం, సాగర్ నుంచి మే వరకు తెలంగాణకు 63 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు 55 టీఎంసీల నీరు కావాలని డిమాండ్ చేశారు. ఇవాళ్టి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరు కాకపోవడంతో కృష్ణానది యాజమాన్య బోర్డు రేపు మరోమారు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

ఏపీ అధికారులు హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా తన వాదనలు రికార్డు చేయాలని కోరారు. బోర్డు సమావేశం ఏర్పాటు చేస్తే ఉద్దేశపూర్వకంగానే ఏపీ అధికారులు హాజరుకాలేదని రాహుల్ ఆరోపించారు. తన అభిప్రాయాలను రికార్డు చేసి కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి నుంచి ఆపినా.. మల్యాల నుంచి కూడా ఏపీ ప్రభుత్వం నీటిని తీసుకుంటోందని ఆయన చెప్పారు. సాగర్ కుడి కాలువ నుంచి తీసుకునే నీటిని 5 వేల క్యూసెక్కులకు తగ్గించాలన్నారు.