22-02-2025 12:36:57 AM
ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బోర్డు నిర్ణయం
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): తెలంగాణ, ఏపీ పరిధిలోని మిగులు కృష్ణా జలాల వినియోగంపై చర్చించేందుకు శుక్రవారం కృష్ణా నదీ నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎం బీ) రెండు ప్రభుత్వాలతో అత్యవసర సమావే శం నిర్వహించాల్సి ఉండగా, ఏపీ ప్రభుత్వ విజ్ఞ ప్తి మేరకు బోర్డు సమావేశాన్ని ఈ నెల 24కు వాయిదా వేసింది.
హైదరాబాద్‌లోని జలసౌధలో సోమవారం మధ్యాహ్నం 3.30 గంట లకు సమావేశం ప్రారంభమవుతుందని ఈమేరకు ఇరు రాష్ట్రాలకు బోర్డు సమాచారమి చ్చింది. కాగా, తెలంగాణ, ఏపీ ప్రాజెక్ట్‌ల పరిధిలో ప్రస్తుతం ఉన్న కృష్ణా నీటి నిల్వ నుంచి తెలంగాణ131, ఏపీ 27 టీఎంసీలను వినియోగించుకోవాలని కేఆర్‌ఎంబీ రెండు రాష్ట్రాలకు సూచించింది.
కానీ శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో ప్రస్తుత నిల్వలో భాగంగా నికర లభ్యత 100 టీఎంసీలకంటే తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే పూర్తి వాటాను వినియోగించుకున్నప్పటికీ, అదనంగా మరో 27 టీఎం సీల కేటాయింపును తెలంగాణ ప్రభుత్వం తీ వ్రంగా వ్యతిరేకించింది.
శ్రీశైలం ప్రాజెక్టు నుం చి ఇష్టానుసారంగా నీటిని తరలించుకుపోతు న్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. దీని పై ఇప్పటికే ఎన్డీఎస్‌ఏ, ఏపీ ప్రభుత్వానికి తమ అభ్యంతరాలు తెలిపింది.
ఏపీకి జలాల తరలింపుపై చర్చ ?
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ఈ ఏడాది ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్టు అనేకసార్లు నిండింది. గేట్లు కూడా అనేకసార్లు ఎత్తాల్సి వచ్చింది. మూడు నెలల వ్యవధిలో ఈ జలాలను ఏపీ మళ్లించుకున్నది. శ్రీశైలం ప్రాజెక్ట్ పరిధిలో నికర జలాలలు 181.81 టీ ఎంసీలు కాగా, ఇప్పుడు కేవలం 79.63 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
ఇక నాగార్జున సాగ ర్‌లోనూ ఇదే తరహా వైఖరి ఏపి ప్రదర్శిస్తున్నది. సాగర్ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312. 05 టీఎంసీలు కాగా, ఇప్పుడు కేవలం 177. 87 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు నికర జలాలు 222 టీఎంసీలు, కాగా ఇక్కడ కూడా నికర లభ్యతను దాటి నీటి వినియోగం జరుగుతున్నది.
రెండు ప్రాజెక్టుల పరిధిలోనూ నికర జలాల కంటే తక్కువగా ఉన్నందున కేఆర్‌ఎంబీ చెప్పినట్లుగా తెలంగాణ 131 టీఎంసీ లైనా వాడుకునే పరిస్థితి లేదు. అందుకే ఉన్న నీటిని మొత్తం తమకే కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. సోమవారం నాటి కేఆర్‌ఎంబీ మీటింగ్‌లో బోర్డు ఏం తేలుస్తుందో చూడాల్సిందే.
జల చౌర్యానికి తావు ఉండొద్దు తెలంగాణ ఇరిగేషన్‌శాఖ
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి కేటాయింపుల కేంటే ఏపీ అదనంగా జలాలు వినియోగిస్తున్నదని, ఇకపై ఒక్క చుక్క నీటినైనా వినియోగించడానికి వీల్లేదని, జల చౌర్యానికి తావు ఉండకుండా చర్యలు తీసుకోవాని తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీని కోరింది. ఈమేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాహుల్ బొజ్జ తాజాగా కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు.
ఈ ఏడాది జులై వరకు తెలంగాణ సాగు, తాగు నీటి అవసరాల కోసం 107 టీఎంసీలు ఇండెంట్ పెట్టి తక్షణమే ఆర్డర్ ఇవ్వాలని కోరామని, అలాగే జూన్ 1 నుంచి జూలై 31 వరకు తాగునీటి కోసం 116 టీఎంసీల కోసం నీటి విడుదల కోసం మరో ఇండెంట్ పెట్టామని లేఖలో గుర్తు చేశారు.