22-03-2025 02:32:47 AM
బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ మహేశ్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత ‘ఆదిపురుష్’ సినిమాలో సీత పాత్రలో మెప్పించింది. ‘వన్’ తరువాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయి వరుస సినిమాలు చేస్తోంది. అక్కడ మంచి స్టార్ డమ్ సంపాదించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ధనుష్‌కి జంటగా నటిస్తోంది. వీరిద్దరూ ప్రధాన పాత్రలో ‘తేరే ఇష్క్ మే’ చిత్రం రూపొందుతోంది. ధనుష్, ఆనంద్ కాంబోలో రూపొందుతున్న మూడో చిత్రమిది.
గతంలో వీరిద్దరి కాంబోలో ‘రాంయునా’, అత్రంగీ రే’ సినిమాలొచ్చాయి. ‘తేరే ఇష్క్ మే’ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 28న హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో కృతి సనన్ షేర్ చేసింది. ‘ప్రేమ కోసం అబ్బాయిలే ప్రాణాలర్పిస్తారా? అమ్మాయిలకూ ఆ ధైర్యం ఉంటుంది’ అంటూ ఫోటోలు షేర్ చేసింది. మరి ఇది సినిమా కాన్సెప్టో.. లేదంటే మరొకటో కానీ ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.