22-04-2025 10:42:12 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో 470 మార్కుల గాను ఆరు భువన కృతి 468 మార్కులు, బి పవిత్ర 468, ఎన్ చందన 467 సాధించగా 465 మార్కులతో బి అనన్య, కే పూజస్వీ , ఎండి ఆలియా నజ్రిన్ , కె ఆర్య, ఎం పరేష్ చౌదరి, పి అఖిల్, ఎం లక్ష్మి సాయి వర్ధన్ ఉత్తీర్ణత సాధించారు.
బైపీసీ విభాగంలో 440 మార్కుల గాను 437 మార్కులతో జి ప్రశస్త, ఎన్ కరుణ శ్రీ, 436 మార్కులతో ఎండి జునేరా తమీన్, ఎండి అయేషా, 435జూనేరా తమీన్,434 మార్కులతో ఎస్ కె తౌఫిక్, బి హేమశ్రీ, 433 మార్కులతో రాగిణి పాశ్వాన్, 432 మార్కులతో బి.సాయి కీర్తన, ఎం రూనే, 431 మార్కులతో ఎస్ కే అలీఫా, డి భవిత,430 మార్కులతో జీన్స్ స్పందన, టీ పూజ ఉత్తన్నత సాధించారు.
సీనియర్ ఇంటర్ విభాగంలో ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను 994 మార్కులు సాధించి కే హసిని, 993 మార్కులతో ప్రియాంబిక, ఎస్ సాయి సంజన, వైస్ఫూర్తి. బైపిసి విభాగంలో 1000 మార్కుల గానం 994 మార్కులతో బి జోత్సన్ ఉత్తమ ఫలితాలు సాధించారు. రాష్ట్రస్థాయి మార్కుల సాధించిన విద్యార్థిని విద్యార్థులను డైరెక్టర్ మాచవరపు కోటేశ్వరరావు, గొల్లపూడి జగదీష్, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, డీన్ జి రామారావు, ఏవో వై వెంకట్ రమణ అభినందించారు.