03-03-2025 12:54:49 AM
‘చలన చిత్ర నటిగా, నిర్మాతగా, నేపథ్య గాయనిగా శోభనాచల స్టూడియో అధినేత గా కృష్ణవేణిది తెలుగు సినిమా రంగంలో ఓ సువర్ణ అధ్యాయం’ అని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కృష్ణవేణి సంస్మరణ సభకు వెంకయ్య నాయుడు హాజరై ఆమె సేవలను కొనియాడారు.
ఆనాటి నటీమణులందూ ప్రతిభావం తులేనని, నటనతోపాటు పాటలను కూడా స్వయంగా పాడుకునేవారని చెప్పారు. కృష్ణవేణి విలక్షణమైన నటి అని అన్నారు. 1949 లో ఎల్‌వీ ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన మనదేశం చిత్రంలో నందమూరి తారకరామారావును పరిచయం చేసిన ఘనత కృష్ణ వేణిదేనని, అక్కినేని నాగేశ్వరరావుతో కీలుగుర్రంతో స్టార్ స్టేటస్ కూడా మీర్జాపురం రాజా, కృష్ణవేణి దంపతుల వల్లనే వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్ధన్, నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ, అక్కినేని రమేశ్‌ప్రసాద్, మాగంటి మురళీమోహన్, డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాతలు కేఎస్ రామారావు, కైకాల నాగేశ్వరరావు, తుమ్మల ప్రసన్నకుమార్, కాట్రగడ్డ ప్రసాద్, రోజారమణి, పూర్ణవిశ్వనా థ్, గుమ్మడి గోపాలకృష్ణ, అక్కినేని వెంకట్, అక్కినేని నాగసుశీల తదితరులు ప్రసంగించారు. కృష్ణవేణి మునిమనవరాలు డాక్టర్ సాయిప్రియ జాస్తి, పరిశ్రమకు చెందిన వ్యక్తులు తరలివచ్చి కృష్ణవేణి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.