calender_icon.png 12 January, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కృష్ణవేణి

12-01-2025 12:00:00 AM

నిర్మల్, జనవరి 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యవర్గాన్ని శనివారం పార్టీ ఆధ్యక్షురాలు సునితారావు ప్రకటించారు. నిర్మల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అల్లూరి కృష్ణవే  రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ నియామక పత్రం అందించారు.

పదేళ్లుగా పార్టీలో మహిళలను చైతన్యం చేస్తున్న కృష్ణవేణి సేవలను గుర్తించి రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించారు. పార్టీ తనకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటూ, పార్టీ కోసం పని చేస్తా నని కృష్ణవేణి తెలిపారు. తనకు పదవిని అప్పగించిన రాష్ట్ర నాయ కత్వానికి, సహకరించిన ప్రతి ఒక్కరికి కృష్ణవేణి ఈ సందర్భంగా కృతజ్ఞత లు తెలిపారు.