calender_icon.png 18 January, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని పట్టణంలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

26-08-2024 03:17:05 PM

మంథని, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ గోపీజన వల్లభ దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా సోమవారం నిర్వహించారు. దేవాలయాన్ని పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం రాధాకృష్ణ మూలవిరాట్టులకు, ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలు, పండ్ల రసాలు, గోదావరి జలాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వర్ణ, రజత ఆభరణాలు, వివిధ రకాల పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేకంగా నైవేద్యాలను తయారు చేసి స్వామివార్లకు నివేదించారు. పూజ పూర్తయ్యే వరకు భక్తులు బారులు తీరారు. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు కనులారా స్వామివారిని వీక్షించి, ప్రత్యేక పూజలు చేసుకుని తన్మయత్వం పొందారు. ఆలయ అర్చకులు మంగళహారతులను నివేదించారు.