calender_icon.png 22 February, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత వస్త్ర పరిశ్రమ సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్‌గా కృష్ణానాయక్

21-02-2025 12:31:03 AM

మఠంపల్లి ఫిబ్రవరి 20: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కృష్ణాతండాకు చెందిన హైకోర్టు న్యాయవాది డాక్టర్ కృష్ణానాయక్ తెలంగాణ రాష్ట్ర చేనేత కౌన్సిల్ మెంబెర్ గా నియమితులై గురువారం హైకోర్టు నుండి నియామక పత్రం అందుకున్నారు.

ఈ సంద ర్బంగా కృష్ణానాయక్ మాట్లాడుతూ సుమారు 16సంవత్సరాల నుండి న్యాయ వాది వృత్తిలో ఉన్న నేను పేదల పక్షాన అనేక వాదనలు హైకోర్టులో వినిపించడం జరిగిందన్నారు. న్యాయశాస్త్రంలో పిహెచ్ డి చేసిన తాను సుమారు ఒక సంవత్సరం సంగారెడ్డి లో ఉన్న ప్రభుత్వ న్యాయ కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేయడం జరిగిందన్నారు.

నామీద నమ్మకంతో నాకు ఈఅవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, సివిల్ సప్లై మంత్రి యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కు ఈసందర్బంగా ధన్యవాదములు తెలియజేశారు.

కృష్ణానాయక్ అభినందనలు

తెలంగాణ రాష్ట్ర చేనేత వస్త్రపరిశ్రమ సంస్థకు స్టాండింగ్ కౌన్సిల్ మెంబెర్ గా నియమితులైన హైకోర్టు న్యాయవాది కృష్ణానాయక్ కు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమ కారుడు సపవత్ సుమన్ నాయక్, బానోతు లచ్చిరాం నాయక్, మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ జిల్లా అధికార ప్రతినిధి దేవపంగు బాబు అభినందనలు తెలిపారు.