calender_icon.png 23 October, 2024 | 4:48 PM

పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

07-08-2024 12:28:47 AM

  1. సాగర్‌లో 22 రేడియల్ క్రస్టుగేట్లు ఎత్తివేత 
  2. ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహం 
  3. పులిచింతలకు ఒక్కరోజులో 12 టీఎంసీలు

నల్లగొండ, ఆగస్టు 6 (విజయక్రాంతి): కృష్ణానది పరవళ్లు తొక్కుతుండటంతో ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు ప్రాజెక్టులన్నీ నిండాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 క్రస్టుగేట్లను 12 అడుగుల మేర సాగర్‌కు 3.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోం ది. మంగళవారం ఉదయం వరకు సాగర్ 20 రేడియల్ క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగింది.  నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 585.20 అడుగులు (298.0121 టీఎంసీలు)గా ఉంది.

రిజ ర్వాయర్ నుంచి కుడి కాల్వకు 8067 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8022 క్యూసెక్కులు, ఎస్సెల్బీసీ (ఏఎమ్మార్పీ)కి 1800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. లోలెవల్ కెనా ల్‌కు గండిపడడంతో నీటి విడుదల నిలిపేశా రు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాగర్ జలాశయాన్ని  సీఈ నాగేశ్వర్‌రావు, ఈఈ మురళీకృష్ణ తదితరులు పరిశీలించారు. నాగార్జున సాగర్ క్రస్టుగేట్లు ఎత్తడంతో 3.5 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహం పులిచింతలకు చేరుతోంది.

సోమవారం సాయంత్రానికి కేవలం 6 టీఎంసీలుగా ఉన్న ప్రాజెక్టు నీటిమట్టం మం గళవారం 6 గంటల వరకు 19 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 45.77 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 19.1377 టీఎంసీలుగా ఉంది. బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయానికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరే అవకాశం ఉంది. భారీ ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఆరు క్రస్టుగేట్టలను 2.5 అడుగుల మేర ఎత్తి లక్ష క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. 

లో లెవల్ కాల్వకు గండి

సాగర్ నాన్ ఆయకట్టు ప్రాంతాలకు సాగునీటి ఆధారమైన లోలెవల్ కాల్వ (ఎల్‌ఎల్‌సీ)కి మంగళవారం ఉదయం గండి పడింది. అనుముల మండలం మారేపల్లి శివారులో కట్ట కొట్టుకుపోయింది. కాల్వకు లైనింగ్ లేకపోవడం, కంపచెట్లు విపరీతంగా పెరగడంతో దిగువకు నీరు సక్రమంగా చేర డం లేదు. కాల్వ అధ్వానంగా ఉండడంతో అధికారులు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయడం లేదని ఆరోపణలున్నాయి. లోలెవల్ కాల్వకు 600 క్యూసెక్కుల ప్రవాహం విడుదల చేయాల్సి ఉండగా 400 క్యూసెక్కు లు మాత్రమే విడుదల చేస్తున్నట్లు తెలిసింది. 

నేడు శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల

నిజామాబాద్/నిర్మల్(విజయక్రాంతి): శ్రీరాంసాగర్ ఆయకట్టు కింద వానకా ల పంటలకు బుధవారం నీటి పారుదల శాఖ అధికారులు సాగునీటిని విడుదల చేయనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఉన్న కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాలువల ద్వారీ నీటిని విడుదల చేస్తారు. కాకతీయ కాలువకు 3 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 800 క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. కాకతీయ కాలువ ద్వార ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు, ఉమ్మడి నల్గొండ, ఖమ్మంజిల్లాలోని కొం త భాగానికి సాగునీరు అందిస్తారు. సరస్వతి కాలువ ద్వార నిర్మల్ జిల్లాకు, లక్ష్మి కాలువ ద్వార నిజామాబాద్ జిల్లాకు సాగునీటిని అందించనున్నారు. ప్రాజెక్టు లో పూర్తిస్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 46.057 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

రాష్ట్రంలోని చెరువుల కళకళ

హైదరాబాద్(విజయక్రాంతి): ఇటీవ ల కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని చెరువులు కళకళలాడుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 34,716 చెరువులు, కుంటల్లో సగానికి పైగా వర్షపు నీటితో నిండాయి. 3,247 చెరువులు మత్తడి దూకుతుండగా... 6,735 చెరువులు నిండాయి. 3,438 చెరువుల్లో దాదాపు 50 నుంచి 75 శాతం వరకు నిండగా.. 6,165 చెరువులు 25 నుంచి 50 శాతం నిండాయి. 15,131 చెరువులు మాత్రం 25 శాతం కూడా నిండలేదు. అంటే రాష్ట్రంలోని చెరువులు, కుంటల్లో దాదా పు 50 శాతం నిండలేదు. ఈ నెల 5నాటికి రాష్ట్రంలోని చెరువులు, కుంటల పరిస్థితి ఇలా ఉంది.