calender_icon.png 18 January, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణా జలాలపై 500 టీఎంసీలకు తగ్గేదేలే

18-01-2025 12:14:05 AM

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ.చిన్నారెడ్డి

రాజేంద్రనగర్, జనవరి 17: సారవంతమైన నేల, సాగుకు అవసర మయ్యే నీరు, నాణ్యమైన విత్తనాలు రైతు లకు అందించినట్లయితే వారు బంగారు పంటలు పండిస్తారని, అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి అన్నారు.

తెలంగాణ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ కేంద్ర సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాజేంద్రనగర్ లోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో 2025 అగ్రికల్చర్ డైరీ, క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్లను డాక్టర్ జి.చిన్నారెడ్డి ఆవిష్కరిం చారు. తెలంగాణ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ వ్బుసైట్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం కోసం రూ.54వేల కోట్లను ఖర్చు చేసిందన్నారు. డ్రిప్ ఇరిగేషన్, పనిముట్లపై సబ్సిడీలు, పంటల భీమా పథకంలాంటి వాటిని తిరిగి ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాలలో వరి సాగు చేసి దేశంలోనే ఎక్కువ వరి ఉత్పత్తులను పండించిన రాష్ట్రంగా తెలంగాణ ప్రసిద్ధికెక్కిందన్నారు. 

వ్యవసాయ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, వ్యవసాయ అధికారులకు కూడా ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాల వారిగా గతంలో ఆత్మ ప్రాజెక్టులలో ఉండే పోస్టులను తిరిగి నియమించేటట్లు ముఖ్యమం త్రి. వ్యవసాయశాఖ మంత్రుల దృష్టికి తీసుకువెళతానన్నారు.

సాగుకు అవసరమయ్యే నీరు, నాణ్యమైన విత్తనాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. తెలంగాణ కు రావాల్సిన క్రిష్ణా జలాల సాధన కోసం ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నా రన్నారు. ప్రస్తుతం 299 టీఎంసీ ల కృష్ణా జలాలను మాత్రమే తెలంగాణకు ఇస్తున్నారని, 500 టీఎంసీలకు తగ్గేదే లేదన్నారు.

కార్యక్రమంలో తెలంగాణ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్ చైర్మన్ బి. కృపాకర్ రెడ్డి, అధ్యక్షులు డాక్టర్ డి.వైద్యనాథ్, ప్రధాన కార్యదర్శి జి.కృపాకర్ రెడ్డి, కోశాధికారి ఎన్.రవీందర్, సత్యనారాయణ, రంగారెడ్డి, కాంతారావు పాల్గొన్నారు.